మనన్యూస్ శంఖవరం (అపురూప్) :
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో గల ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్ గా శంఖవరం మండలం మాజీ ఎంపీపి బద్ధి మణి నియమితులయ్యారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావరం నుంచి శంఖవరం మండలంలోని నెల్లిపూడి గ్రామానికి చెందిన బద్ది రామారావు కుటుంబం పార్టీకు వీర విధేయులుగా పనిచేస్తూ, పార్టీ కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఒడిదుడుకులను సైతం ఎదుర్కొంటు వచ్చారు. తెలుగు దేశం పార్టీ కష్టించి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందనే దానికి ఉదాహరణే బద్ది రామారావు కుటుంబానికి పార్టీ ఆదరణ.
బద్ధి కుటుంబ రాజకీయ నేపధ్యంలో నెల్లిపూడి గ్రామ సర్పంచ్ గా బద్ధి రామారావు రెండు పర్యాయాలు కొనసాగారు. అలాగే అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా పనిచేసారు. రామారావు సతీమణి బద్ది మణి రెండు పర్యాయాలు ఎంపిటిసి గానూ, అందులో ఒక పర్యాయం 2014 నుండి 2019 వరకు మండల పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేసారు. అలాగే బద్ది రామారావు
సోదరుడు రమణ ఒక పర్యాయం సర్పంచ్ గా పనిచేసారు. బద్ది రామారావు సుమారు 25 ఏళ్ళు పైబడి పార్టీ మండల అధ్యక్షునిగా కొనసాగుతూ వస్తున్నారు. రాజకీయ నేపధ్యంతోపాటు పార్టీకి కట్టుబడి పనిచేసే బద్ది కుటుంబానికి ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా బద్ధి మణిని నియమించడం పట్ల నియోజకవర్గంలోని తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.బద్ధి మణికి ప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్, రాష్ట్ర టిఎన్టీయుసీ ఉపాధ్యక్షుడు వెన్నా శివ, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి సుభాష్, పార్టీ మండల కార్యదర్శి ఉల్లి వీరభద్రరావు, పార్టీ నేతలు పోలం చిన్నా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.