మన న్యూస్,నిజాంసాగర్, దళారులను నమ్మి రైతును ఎవరు కూడా మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలన్నారు.జుక్కల్ నియోజకవర్గంలోని
పిట్లంమండలంలోనిబండపల్లి,
బిచ్కుంద మండలంలోని బండరెంజల్,వాజీద్ నగర్,శెట్లూరు,ఖత్గావ్ గ్రామాలల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. అంతకముందు కొనుగోలు కేంద్రం కాంటాకు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి కాంటాపై వరి ధాన్యం వస్తాను పెట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోకుండా ఉండేందుకు కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యాన్ని విక్రయిస్తే సకాలంలో ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుందన్నారు. దళాలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే రైతులకు సూచించారు.అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మహిళలు పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ రామ్ రెడ్డి ,సొసైటీ చైర్మన్ లు రైతులు తదితరులున్నారు.