మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరిన గిరిజనులు,
మనన్యూస్,పార్వతిపురం:మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రహదారులు పూర్తిస్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గుమ్మడి గూడ జంక్షన్ వద్ద గిరిజన యువత నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం.నాయకులు గిన్నిపల్లి రాజు ఎర్రజన్ని చందర్రావు బోయిన వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గిన్నిపల్లి రాజు మాట్లాడుతూ.గుమ్మడిగూడ బీటీ రోడ్ నుండి తాటి మాను సరి వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని. దిగువ చింతలవలస నుండి కాకులు మామిడి వలస వరకు రోడ్డు వెయ్యాలని.కటారి కోట బీటీ రోడ్డు నుండి గ్రామం వరకు రోడ్డు వేయాలని. కోరుతూ ప్రభుత్వం అధికారులు స్పందించి రహదారుల పైన ప్రత్యేక శ్రద్ధ నిర్వహించాలని కోరారు. విద్య వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలంటే రహదారులు పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టాలనికోరారు. ఎగువ చింతలవలస నుంచి దిగువ చింతలవలస వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని.దిగు చింతలవలస ఎగువ చింతలవలస గ్రామాల నుండి గుమ్మడి గూడ గ్రామంలో పాఠశాలకు రావాలంటే మూడు కిలోమీటర్లు చొప్పున నడిసి రావలసిన పరిస్థితి ఉందని వెంటనే రహదారి నిర్మాణం పూర్తి చేసి గిరిజనులను ఆదుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా వీరికి మద్దతుగా. సిపిఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ.ఏజెన్సీ హిల్ టాప్ గిరిగిన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అధికారులు సర్వేలు జరిపి రహదారులు సమస్య లేకుండా అన్ని గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. రహదారులు త్రాగునీటి సమస్యపై ప్రత్యేక శ్రద్ధ అధికారులు చేపట్టాలని కోరారు. పాచిపెంట మండలం గుమ్మడి గూడ జంక్షన్ వద్ద ఆదివాసి గిరిజన సంఘం పాచి పెంట మండలంనాయకులు గిన్నిపల్లి రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.