మనన్యూస్,నెల్లూరు:ఉగాది పండుగ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు 44 వ డివిజన్ చాకలి వీధిలోని మహాలక్షమ్మ ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమానికి..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా 44 వ డివిజన్ కార్పొరేటర్ నీలి రాఘవరావు తో కలిసి చంద్రశేఖర్ రెడ్డి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమంలో పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్ , వైసిపి నాయకులు బాలకృష్ణారెడ్డి, మీరా, షఫీ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.