మనన్యూస్,కోవూరు:ప్రభుత్వ కాలనీలలో తాగునీటి సదుపాయం కల్పించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో మొత్తం 90 ప్రభుత్వ కాలనీలు ఉంటే వాటిలో 55 కాలనీలకు వాటర్ పైప్ లైన్స్ వేసినట్టు అధికారులు వివరించారు. మిగిలిన 40 కాలనీలలో వాటర్ పైప్ లైన్ పనులు వివిధ దశలలో ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ……హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని పని చేయాలని సూచించారు. మొత్తం 95 ప్రభుత్వ కాలనీలలో తాగునీటి సరఫరా చేసేలా త్వరతగతిన వాటర్ కనెక్షన్స్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వాటర్ పైప్ లైన్ పనులు పూర్తి అయివున్న 55 కాలనీలలో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్నారు. మిగిలిన 40 కాలనీలలో కూడా యుద్ధప్రాతిపదికన నీటి సరఫరా చేసేలా వాటర్ పైప్ లైన్ పనులు వేగవంతం చేయాలన్నారు. తాగునీరు సరఫరా చేసే పైప్ లైన్ నిర్మాణ పనులలో నాణ్యతా పాటించాలని అధికారులకు సూచించారు.