మనన్యూస్,గొల్లప్రోలు:ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేయబడిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్) కార్యక్రమం ఈ నెల 7న పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ వద్ద గల పాడా కార్యాలయంలో ఉదయం 10:00 గంటల నుంచి 01:00 గంట వరకు నిర్వహించడం జరుగుతుందని పాడా పీడీ ఏ.చైత్ర వర్షిణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన డివిజనల్, మండల స్థాయి అధికారులు అందరూ విధిగా హాజరు కావాలని పాడా పీడీ ఆదేశించారు.
అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.