మనన్యూస్:తాను చూసిన వివక్ష భావితరాలకు అందకూడదని ప్రతిఘటిస్తున్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ అని అన్నారు.
బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా శనివారం నెల్లూరు రూరల్ వేదయపాలెం నందు గల వారి విగ్రహానికి మాలలు వేసి జనసేన నాయకులు కిషోర్ గునుకుల నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ………
స్వాతంత్ర సమరయోధులు, సాంఘిక సంస్కర్త, అణగారిన వర్గాల కోసం ఇండియన్ డిప్రెజ్డ్ లీగ్ ప్రారంభించి బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి పోరాడిన బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా మహాత్ముని స్మరిస్తూజసేన పార్టీ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం అని అన్నారు.వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి ఎంతో అభ్యున్నతి సాధించి దేశానికి 30 సంవత్సరాలు పైగా క్యాబినెట్లో మంత్రి పనిచేసిన ఆయన సేవలు చిరస్మరణీయం అని తెలిపారు.
దేశ వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రక్షణ మంత్రి గాను ఆహరపు కొరత ఉన్నప్పుడు హరిత విప్లవం, ఆధునిక వ్యవసాయాన్ని దేశానికి పరిచయం చేసి కీలకంగా వ్యవహరించిన వారి జాతికి చేసిన స్పూర్తి ని ముందుకు తీసుకెళ్తామని జనసేన పార్టీ తరఫున తెలుపుతున్నాం అని అన్నారు.సరిగ్గా రెండు సంవత్సరాల ముందు నెల్లూరు జిల్లా,సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు లో పదివేల రూపాయలు అప్పు తీసుకొని చెల్లించలేదన్న కారణంగా దళిత యువతి ను వివస్థ్ర ను చేసి కొట్టిన వైసిపి ప్రభుత్వం విష వైఖరి తో దళితులపై అన్యాయంగా కేసులు బనాయించి ఇబ్బందులు పాలు చేసింది అని తెలిపారు.
నీరు,గాలి,ఆహారం పల్లెలకు దారులు అనేవి కనీస హక్కులుగా భావించి పోరాడుతున్న మా పవన్ కళ్యాణ్,పౌరసరఫరాల శాఖ ద్వారా వెనకబడిన వర్గాలకు ఎంతో సహాయం కొరకు కృషి చేస్తున్న నాదెండ్ల మనోహర్ ,ఇల్లు లేని పేదలు ఉండకూడదని నరేంద్ర మోడీ చంద్రబాబునాయుడు, మా మున్సిపల్ శాఖ మాత్యులు పొంగూరు నారాయణ నాణ్యమైన ఇల్లు నిర్మిస్తూ మాకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతుందని తెలియజేస్తున్నాను అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ తో సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ పట్టణ కార్యదర్శి హేమచంద్ర యాదవ్ 16 డివిజన్ నాయకుడు నరహరి 42వ డివిజన్ నాయకుడు 21వ డివిజన్ నాయకుడు శరవణ,పార్టీ నాయకులు పవన్, శ్రీను, నను, ప్రకాష్, వాసిమ్, ఫిరోజ్, సయెద్,తదితరులు పాల్గొన్నారు.