మనన్యూస్:భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావ్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి లోని ఆర్ అండ్ బి భవన సమీపంలో ఎమ్మార్పీఎస్ కలిగిరి మండల నాయకులు బాబు జగజీవన్ రావ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ భారతదేశానికి ఒక దిక్సూచి లాగా ఆయన యొక్క ఆలోచనలు ఉండేవని దళిత జాతికే కాకుండా భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడని ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడరు. అదేవిధంగా ఒక గొప్ప రాజకీయ నాయకుడు, పోరాట యోధుడు, సంఘసంస్కర్త అయినా బాబు జగజీవన్ రాయ్ గారు బీహార్ లోని వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చి భారత పార్లమెంట్ లో 40 సంవత్సరాలపాటు వివిధ పదవులతో పాటు భారతదేశ ఉప ప్రధానిగా కూడా సేవలందించాడని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎమ్మెస్ ఎఫ్ ఎంఈఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.