మన న్యూస్ : పినపాక, నవంబర్, 14, 2024, తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధుడు, భారతరత్న జవలాల్ నెహ్రూ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పినపాక మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం అన్నారు. నెహ్రూ జన్మదినం సందర్భంగా బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం రామనాథం మాట్లాడుతూ.. భారతదేశ అభివృద్ధికి రక్షణకు నెహ్రూ తన ప్రాణం ఉన్నంతవరకు విశేషమైన సేవలందించారన్నారు. భారతదేశ స్వతంత్ర సమరయోధుడిగా ఎన్నో ఉద్యమాలను నిర్వహించి, భారతదేశానికి స్వాతంత్రం తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించి చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కొంబత్తిని శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు గీద సాయిబాబు, బోడ లక్ష్మణ్ రావ్, బోలిశెట్టి ప్రభాకర్, సమ్మయ్య లు పాల్గొన్నారు.