ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Aprilil 5, 2025, 6:43 pm
సన్న బియ్యం పంపిణీ ఒక చారిత్రాత్మక విప్లవం.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,సన్న బియ్యం పంపిణీ ఒక చారిత్రాత్మక విప్లవం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.బిచ్కుంద మండలంలోని బండరెంజల్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యంన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సన్న బియ్యం పంపిణీ ఒక చారిత్రాత్మక విప్లవం అన్నారు.దేశ వ్యాప్తంగా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ప్రతి నెల ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వల్ల ప్రజలు ఎవరూ వాటిని తినకపోగా. దళారులకు అమ్ముకోవడంతో పథకం పక్క దారి పట్టి ప్రభుత్వానికి నష్టం వాటిల్లేదని అని అన్నారు.ఇప్పుడు ప్రజా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల పేదల కడుపు నింపడమే గాక ఒక్కో కుటుంబానికి రూ. 1500 వరకు ఆదా అవుతుందని అన్నారు.అనంతరం బండరెంజల్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా సిసి రోడ్లు మంజూరు కావడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.