మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని ఊట్కూరు మండలం శివారులోని కొంతమంది డబ్బులు పందెం పెట్టుకుని పేకాట ఆడుతుండగా పక్క సమాచారంతో ఊట్కూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఆరుగురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఊట్కూర్ ఎస్సై కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టుబడిన వ్యక్తుల నుండి 7700 రూపాయలు ఆరు సెల్ ఫోన్లు మూడు బైకులు పేకాట ముక్కలను స్వాధీన పరచుకోవడం pజరిగిందని తెలిపారు. అట్టి వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తరలించి గేమింగ్ ఆక్ట్ ప్రకారం ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.