మన న్యూస్,నిజాంసాగర్, బిచ్కుంద మండలంలోని వాజీద్నగర్లో వడగళ్ల వర్షంతో వరి,జొన్న పంటలు దెబ్బతిన్నాయి.దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్థానిక నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడవద్దని,ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేస్తానన్నారు.అధికారులు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక రూపొందించాలని చెప్పారు.రైతులు ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోకూడదు అని అన్నారు.ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు తదితరులున్నారు.