
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలి..!
సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కాకర్లసురేష్.
మనన్యూస్,వింజమూరు:ఇల్లు లేని ప్రతినిరుపేదకు గూడు కల్పించాలని, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు.గురువారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమావేశం నిర్వహించారు. వారితో ముఖాముఖి మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను ఏ విధంగా పూర్తి చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. లోపాలను ఎలా సవరిస్తారు వారి ఇబ్బందులు తదితర అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లు లేని పతి నిరుపేదకు ఇంటిని కట్టి ఇవ్వాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేకుండా చెల్లింపులు జరగాలన్నారు. చిన్న చిన్న లోపాలను సవరించి ప్రతి అర్హునికి లబ్ధి చేకూరేలా పని చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి హౌసింగ్ డి ఈ సయ్యద్ పిరాన్ హౌసింగ్ ఏఈ లు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తదితరులు ఉన్నారు.
