నాణ్యమైన పెట్రోల్ డీజిల్ ను అందించండి.. వాహనదారులు సద్వినియోగం చేసుకోండి..!
ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్
మనన్యూస్,కలిగిరి:మండల కేంద్రానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కొండాపురం కలిగిరి ప్రధాన రహదారి పక్కన ఇండియన్ ఆయిల్ వారి త్రిబుల్ ఆర్ ఫీలింగ్ స్టేషన్ ను శుక్రవారం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా పెట్రోల్ బంక్ యాజమాన్యం ఎమ్మెల్యే దంపతులకు గారికి ఘన స్వాగతం పలికారు. శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి రిబ్బన్ కటింగ్ చేసి త్రిబుల్ ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం వాహనదారులకు పెట్రోల్ మరియు డీజిల్ ను పంపింగ్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన పెట్రోల్ డీజిల్ ను వాహనదారులకు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ పెట్రోల్ బంక్ ను వాహనదారుల సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. త్రిబుల్ ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ యాజమాన్యం మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి మండల నాయకులు గ్రామ నాయకులు బంధుమిత్రులు తదితరులు ఉన్నారు.