మనన్యూస్,మక్తల్ నియోజకవర్గం:నర్వ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో
లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కరపత్రాలను విడుదల చేసిన ధర్మ సమాజ్ పార్టీ నేతలు. తెలంగాణలో బీసీ,ఎస్సీ,ఎస్టీ రాజ్యాధికార సాధన JSC ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ను ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి నాడు ఆదిలాబాదులో జరగబోయే సభకు నారాయణపేట జిల్లా నుండి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు,విద్యార్థి సంఘాల నాయకులు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని ధర్మ సమాజ్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు డేవిడ్,ఈశ్వర్ మహారాజ్, మల్లికార్జున్,బలిజ వీరేష్, శ్యామ్,అశోక్ మహారాజ్, మన్యం మహారాజ్, సురేష్, లంబాడి అంజి, ఈశ్వర్, రమేష్, సుధాకర్, అరుణ్, ఆంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.