మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పేదల పెన్నిధి సిఎంఆర్ఎఫ్ అని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్ప మోహన్ అన్నారు. ఆయన శుక్రవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో నీరుడి అశోక్ 21వేలు,రీమా బాయి 32 వేలరూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి పేదల వైద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని పదిలక్షలరూపాయలు పెంచి బీద ప్రజలను ఆదుకుంటుందని తెలిపారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ముఖ్యమంత్రి సహాయ నిధి సాయాన్ని బాధితులకు అందజేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.ఈ కార్య క్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ గోకన్ గంగాగౌడ్,కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మొహిద్దిన్ పటేల్,నాయకులు మల్లప్ప పటేల్,ఇస్మాయిల్ పటేల్,యూసఫ్ పటేల్,పాండు నాయక్,బార్థ్యానాయేక్, శేక్ చాంద్ పాషా,శంకర్, పర్వయ్య,మొగులయ్య,రియాజ్ పటేల్, సుధార్,కుమార్ ,రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.