మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సంఘం పరిధిలోని నర్సింగ్ రావు పల్లి,గోర్గల్ గ్రామాలల్లో సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి తూకానికి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి కాంటపై వరి ధాన్యం బస్తాను పెట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోని రైతులు ధాన్యాన్ని విక్రయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి,మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి, డిసిసిబి మాజీ డైరెక్టర్ మోహన్ రెడ్డి,నాయకులు విఠల్ గౌడ్,కాశయ్య, రామగౌడ్,అజ్జం దుర్గయ్య, సాయ గౌడ్, సీఈఓ సంగమేశ్వర గౌడ్,తదితరులు ఉన్నారు.