మన న్యూస్: ఎన్నిసార్లు ఎమ్మార్వో కార్యాలయానికి తిరిగిన తమ యొక్క సమస్యలను పరిష్కరించడం లేదని పట్టించుకోవడంలేదని అదనపు కలెక్టర్ పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ యొక్క సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో సద్దుమణిగారు, తహసిల్దార్ జయంత్ రెడ్డిని,ఆర్ఐ విద్యాసాగర్ ను ఇక్కడినుండి బదిలీ చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతులు ముఖ్యర అంజయ్య మాట్లాడుతూ సర్వేనెంబర్ 120/1 లో కుమ్మరి నర్సవ్వ దగ్గర ఐదు గుంటల భూమి తీసుకోవడం జరిగిందని. సర్వేనెంబర్ 928/2/B లో 10 గుంటల భూమి తీసుకోవడం జరిగిందని, సర్వేనెంబర్ 931లో గొల్ల అరికెటి నరసవ్వ దగ్గర ఒక ఎకరం రెండు గుంటల భూమి తీసుకోవడం జరిగిందని అట్టి భూములో పంట పండించుకొని ముగ్గురం అన్నదమ్ముల కలిసి పంట పండించుకొని బతుకుతున్నామని తెలిపారు, రిజిస్ట్రేషన్ చేయమంటే ఇబ్బందుల గురి చేస్తున్నారని ఇట్టి విషయం పైన పలుసార్లు ఎమ్మార్వో కార్యాలయమునాకు వెళ్లిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సార్ వస్తే వారికి కూడా చెప్పడం జరిగిందని త్వరలోనే మాకు న్యాయం చేస్తామని చెప్పారని అన్నారు.