మనన్యూస్,తిరుపతి:తిరుపతి మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ పి.మునిరెడ్డి సతీమణి స్వర్గీయ పి శారదమ్మ శుభస్వీకరణ కార్యక్రమం వారి కుమారులు పి.సుధీర్ కుమార్ రెడ్డి,పి.నవీన్ కుమార్ రెడ్డి, భువన్ కుమార్ రెడ్డి,జీవన్ కుమార్ రెడ్డి ల ఆధ్వర్యంలో గురువారం మంగళం రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కుటుంబ సభ్యులు, బంధువులు సన్నిహితులు ఆమె చిత్రపటానికి నివాళులర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నివాళులు అర్పించిన వారిలో కుటుంబ సభ్యులు, ఆత్మీయులు బంధుమిత్రులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి,నగిరి శాసనసభ్యులు,గాలి భాను ప్రకాష్,టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి,మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తెలంగాణ వ్యవసాయశాఖ మాజీ మంత్రి టిఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి,నగర మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం,డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ ఆర్ సి మునికృష్ణ మబ్బు దేవనారాయణరెడ్డి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, పులిగోరు మురళి కృష్ణారెడ్డి, కేతం జయచంద్ర రెడ్డి, కార్పొరేటర్లు ఎస్ కే బాబు,అన్నా అనిత, నర్సింహాచారి నగరంలోని ప్రముఖ వైద్యులు,పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని శారదమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.