మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):ఇటీవల కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా వాగు గున్నబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా గున్నబాబును ఏలేశ్వరం మండల ఆర్యవైశ్యు సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ మేరకు గున్నబాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వూర నానాజీ,మాటూరు సూరిబాబు, పులవర్తి శీను,పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.