మనన్యూస్,తిరుపతి:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా బుధవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో ప్రమాణస్వీకారం చేసిన కొణిదల నాగబాబు కు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అభినందనలు తెలిపారు. జనసేన ప్రధాన కార్యదర్శి గాను వ్యవహరిస్తున్న నాగబాబు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన ఆకాంక్షించారు.