మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నరసింహ యాదవ్ ను పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు కలసి శాలువులతో ఘనంగా సత్కరించారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నరసింహ యాదవ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను తిరుపతికి చెందిన టిడిపి బీసీ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జగన్నాథం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంపురి భాస్కర్ యాదవ్ లు శాలువులతో ఘనంగా సత్కరించారు. వీరితోపాటు తిరుపతికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీ సంఘాల ప్రతినిధులు ఆయనను సాలువులతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.