పరామర్శించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
మనన్యూస్,సాలూరు:విశాఖపట్నం, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బుధవారం సాయంత్రం విశాఖపట్నం విజేత ఆసుపత్రికి వెళ్లి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పాచిపెంట మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్ బాబును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ప్రసాద్ బాబు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణతో వ్యక్తిగతంగా మాట్లాడి, అన్ని విధాలా మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పిన్నింటి ఈశ్వరరావుతో కూడా మంత్రి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. ప్రసాద్ బాబు త్వరలోనే పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వస్తారని కుటుంబ సభ్యులకు తెలిపారు.
ఆమెతో పాటు ముఖి సూర్యనారాయణ, యుగంధర్, కనకబాబు, సత్యన్నారాయణ, సాంబ,పార్టీ నాయకులు ఉన్నారు.