మనన్యూస్,పాచిపెంట:త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం,ఖాళీ బిందెలతో. నిరసన తెలుపుతూ రోడ్డెక్కిన గొలుగువలస మహిళలు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పాచిపెంట మండలం గురువు నాయుడుపేట పంచాయతీ గొలుగువలసలో దళితులు గిరిజనులు దాదాపు 300 కుటుంబాలు పైగా త్రాగునీటి సమస్య వలన ఇబ్బందులకు గురవుతున్నామని సుర సన్యాసమ్మ జని గౌరమ్మ పాంగి గంగమ్మ రాయిపల్లి గౌరమ్మ ఆమెటి మజ్జమ్మ ఆధ్వర్యంలో మహిళలంతా ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.త్రాగునీరు లేక చిన్న పిల్లలతో సహా అందరం కష్టాలు పడుతున్నామని పెద్దగడ్డ జలాశయంలో వస్తున్నటువంటి నీరు దాదాపు 5 నెలలుగా నీరు లేకుండా పైపులు చూడడానికి ఉన్నాయి తప్ప మాకు నీరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ వీధిలో ఉన్న ఒక బోరు రెండు విందులు వస్తే దాదాపు గంట వరకు నీరు రాదని వెంటనే మోటార్ పైపులు ద్వారా త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సిపిఎం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్రాగునీటి సమస్య పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ప్రధానంగా త్రాగునీటి సమస్య పైన అధికారులంతా దృష్టి పెట్టి వేసవిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు.కానీ ఆ దశగా అధికారులు ప్రభుత్వం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మౌలిక సదుపాయాలు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్రాగినీటి సమస్య పరిష్కారం అధికారులు అంతా గ్రామీణ ప్రాంతాలు తిరిగి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి వినతిపత్రం అందించడం జరిగింది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ త్వరలో సమస్య పరిష్కారం చేస్తామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్రాగునీటి సమస్య ఎక్కడున్నా వెంటనే పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సురహరి రాయపల్లి ధాన్యాలు జర్నీ పాపారావు ఎస్. ప్రేమ్ కుమార్ వి.భాను తదితరులు పాల్గొన్నారు.