తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ
త్వరలోనే అర్హులైన వారికి నూతన రేషన్ కార్డుల పంపిణీ,,పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ కానుకగా పేద ప్రజల కోసం ఉగాది నాడు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నేటి నుండి ప్రతి నియోజకవర్గo లో ఎమ్మెల్యేలు, అధికారుల చే రేషన్ షాపు నందు సన్న బియ్యం పంపిణీ నిర్వహించారు ఇందులో భాగంగా కె.టి దొడ్డి మండల కేంద్రము లో నందు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.ఎమ్మెల్యే నాయకులు, కార్యకర్తలు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు,ఎమ్మెల్యే చేతులు మీదుగా పేద ప్రజలకు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ ప్రారంభించడం జరిగినది.ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ
గతంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు పేద ప్రజల ఆకలిని తీర్చాలని ప్రతి ఒక్కరూ పేదవారు కూడా కడుపునిండా అన్నం తినాలని దూర దృష్టితో ఆలోచించి రేషన్ షాపు ద్వారా రెండు రూపాయలకే బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది.పేద ప్రజల ఆకలి తీర్చడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వారు కూడా అదేవిధంగా పేద ప్రజలకు బియ్యమును పంపిణీ చేయడం జరిగింది.నేడు ప్రజా పాలన ప్రభుత్వంలో సీఎం నేతృత్వంలో దేశంలో ఎక్కడలేని విధంగా చారిత్రాత్మకమైన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద కడుపునిండ అన్నం తిని ఆరోగ్యంగా జీవించాలని ప్రభుత్వమే రైతుల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేసి బియ్యముగా తయారుచేసి రేషన్ షాపుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపు నందు ఉన్న షాపు నందు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో సభ్యులకు ప్రతి ఒక్కరికి ఆరు కిలో చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి ఈ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి అని పేర్కొన్నారు.
మార్కెట్లో సన్న బియ్యం కొనాలంటే 1 కిలో 40 రూపాయలు ప్రభుత్వం ఎంత కష్టమైనా పేద ప్రజల ఆకలి తీర్చాలని ముఖ్య ఉద్దేశంతో ఉచితంగా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించి ఈ బియ్యాన్ని మీ కుటుంబ సభ్యులతో సద్వినియోగం చేసుకోవాలి విక్రయ దారులకు బియ్యము బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం వల్ల ప్రభుత్వ ధనాన్ని వృధా చేసినవారు అవుతారు అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు .
త్వరలోనే ప్రజలందరికీ ప్రజా పాలనలో నమోదు చేసుకున్న వారికి నూతన కొత్త రేషన్ కార్డుల మంజూరైన వారికి త్వరలోనే వారికి కూడా రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం పేద ప్రజల ఉద్దేశిం చుకుని ఎంత కష్టమైనా పేద ప్రజల ఆకలి తీర్చాలని ముఖ్య లక్ష్యంతో ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.గద్వాల నియోజకవర్గం ప్రజలందరి తరఫున సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన ధన్యవాదాలుతెలిపారు,ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు, అధికారులు , తదితరులు పాల్గొన్నారు.