మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మహ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో రేషన్ దుకాణాన్ని తహసీల్దార్ సవాయి సింగ్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నిరుపేదలకు సన్న బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతుందని అన్నారు.ఈ పథకాన్ని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. నాణ్యతతో కూడిన సన్నబియ్యాన్ని అందజేస్తున్నట్లు
తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్వ రేషన్ షాప్ డీలర్ వెంకటేశం,తదితరులు ఉన్నారు.