Mana News :- కలిగిరి న్యూస్ :- నెల్లూరు జిల్లా కలిగిరి మండలం సిద్దనకొండూరు గ్రామంలో గత 40 సంవత్సరముల నుంచి తపాలా సర్వీసులు చుట్టుపక్కల ప్రజలకి అందించడం జరుగుతుంది.
ఇప్పుడు ఆ భవనము కాస్త శిథిలా వ్యవస్థకి చేరటం వల్ల సిద్ధన కొండూరు మెయిన్ రోడ్ లో ఉన్న కేసీ కాంప్లెక్స్ లోనికి మార్చడం జరిగింది.ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ, సర్పంచ్ గొట్టిపాటి భవాని వెంకటేశ్వర్లు గేనేడి పెంచల నరసింహo కావాలి నుండి A S P R. మల్లేశ్వరరావు ఈ నూతన భవనమును రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. సిద్ధన కొండూరు పోస్ట్ మాస్టర్ కళ్యాణ్ రావ్ మాట్లాడుతూ ఈ తపాలా ఆఫీసు నందు పౌర సర్వీసులన్నీ చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ ఈ సర్వీస్ లను ఉపయోగించుకోవాలి అని ఆయన కోరారు.