మనన్యూస్,ఏలేశ్వరం:దుర్గా శ్రీనివాస్ నగర పంచాయతీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడ అని పలువురు జనసేన నాయకులు విమర్శలు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటోతో పాటు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ప్రభుత్వ కార్యాలయాలలో పెట్టాలని ఆదేశాలను జారీ చేశారు.ఏలేశ్వరం నగర పంచాయతీ కార్యాలయంలో మాత్రం ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టకుండా నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలువురు జనసేన నేతలు మండిపడుతున్నారు. నగర పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫోటో పెట్టకపోవడం ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగర పంచాయతీ అధికారులు స్పందించి ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని లేనిపక్షంలో పలువురు జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపడతామన్నారు.