మనన్యూస్,తిరుపతి:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం ఉదయం పల్లె వీధి, ఎల్లపురెడ్డి కాలనీల్లో పెన్షన్లు పంపిణీ చేశారు. నగరంలో 18,714 మంది లబ్ధిదారులకు 8 కోట్ల 21లక్షల 47వేల రూపాయలు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి నెలా ఒకటవ తేదీ ప్రభుత్వం ఇస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్దిదారులకు పెంచిన పెన్షన్ ను ఎన్డీఎ కూటమి ప్రభుత్వం ఇస్తోందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం రెండు వేల నుంచి మూడు వేలకు పెంచేందుకు ఐదేళ్లు తీసుకుందని ఆయన ఆరోపించారు. లబ్ధిదారులకు ఇచ్చిన పెన్షన్ కన్నా గత ప్రభుత్వం పబ్లిసిటీ కి పెట్టిన ఖర్చే ఎక్కువని ఆయన విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ముందున్నారని ఆయన చెప్పారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత సీఎం, డిప్యూటీ సీఎం ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే ఇది మంచి ప్రభుత్వమని ప్రజల చేత అనిపించుకుందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షం అనేది లేకుండా ప్రజలు తీర్పు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నరసింహాచ్చారి, ఎస్కే బాబు, నరనరేంద్ర, బుల్లెట్ రమణ, తిరుత్తణి వేణుగోపాల్, దూది శివ, జేడబ్ల్యూ విజయ్ కుమార్, మహేష్ యాదవ్, రవి, విజయలక్ష్మి, రాజా రెడ్డి, బాబ్జీ, మనోజ్, సునీల్ చక్రవర్తి, అశోక్, కోదండ, బాలాజీ, ఇనుకొండ సుబ్రమణ్యం, వరప్రసాద్, నరసింహ యాదవ్ , ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, అముదాల వెంకటేష్, కుప్పయ్య, జగదీష్, జ్ఞాన, హేమ, అనితా, బాలాజీ నాయుడు తదితరులు.