మనన్యూస్,ప్రత్తిపాడు:దుర్గా శ్రీనివాస్ గర్భిణీ స్త్రీలకు,రోగులకు దాహార్తి తీర్చేందుకు వివేకానంద సేవా సమితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్డెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్,వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సి హెచ్ సి సూపర్డెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్,వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని,వైస్ చైర్మన్ బొల్లు చిన్నోడు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా సి హెచ్ సి సూపర్డెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ మాట్లాడుతూ ఎండ తీవ్రత రోజురోజుకి పెరుగుతున్నందువలన ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు,రోగులు డీహైడ్రేషన్ కి గురి కాకుండా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్యప్రభ రాజా పిలుపు మేరకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని గర్భిణీలు గర్భిణీ స్త్రీలు,రోగులు ఉపయోగించుకోవాలని కోరారు. వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరావు మాట్లాడుతూ ప్రతి మంగళవారం చలివేంద్రం ద్వారా మజ్జిగ అందించడంతో పాటు ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శి వర్మ సహకారంతో త్రాగునీరు ఏర్పాటు చేస్తున్నామన్నారు.అలాగే రానున్న రోజుల్లో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు దాతల సహకారంతో పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కటారి దుర్గా మల్లేశ్వర సాగర్,బొల్లు మనోజ్ బాబు,వివేకానంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.