మనన్యూస్,ఏలేశ్వరం:దుర్గా శ్రీనివాస్ ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో ఉదయం నుండి పెన్షన్ల సచివాలయ అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు. దీనిలో భాగంగా నూతనంగా మారిన వితంతు పెన్షన్ లను టిడిపి నాయకులు బసా ప్రసాద్, మైరాల కనకారావు సమక్షంలో లబ్ది దారులకు అందజేసారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
భర్త మరణానంతరము వారి వృద్ధాప్య పెన్షన్ ను తమ భాగస్వామి భార్యలకు వితంతు పెన్షన్ రూపంలో మజురు చేయబడినవని తెలిపారు. వాటిని యర్రవరం గ్రామాల్లో 5గురు మహిళలకుఈ నెల నుడి నూతనముగా పంపిణి చెయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీకార్యదర్శి వర్మ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు