మనన్యూస్,దుత్తలూరు:నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంగమాంబ గుడిలో పనిచేస్తున్న ఉదయగిరి సురేష్ ( 39 ) అను వ్యక్తి కరెంట్ షాక్ తగిలి మరణించారు గత పది సంవత్సరాలుగా వెంగమాంబ గుడిలో ( హౌస్ సోర్స్ ) పనిచేస్తున్నాడు సాయంకాలం సమయంలో సుమారుగా 7:00 నుండి 7:30 సమయంలో గుడి దగ్గర టెంకాయలు అంగడి వేలంపాట కాల పరిమితి తీరగా టెంకాయలు అంగడి వాళ్లు సామాను సర్దుకొని సమయంలో సురేష్ (మృతి చెందిన వ్యక్తి ) ని సహాయం కోరగా ఈ విద్యుత్ ఘాతకం జరిగింది.అక్కడ ప్రజలు హటావోటిన ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు కారులో తీసుకెళ్లగా దారి మధ్యలో 108 వాహనములలో సిబ్బందికి అప్పగించారు అక్కడ నుంచి 108 సిబ్బంది వారు తీసుకువెళ్లగా అక్కడ విధులు లో ఉన్న వైద్యాధికారి మరణించారని తెలియ జేయడం జరిగింది. అనంతరం అక్కడికి
దుత్తలూరు పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ ఆదిలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిసరాలని గమనించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది.