ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి ఘన స్వాగతం పలికిన మైనారిటీ సోదరులు..!
మనన్యూస్,ఉదయగిరి:రంజాన్ అంటే శాంతి మతసామరస్యానికి, ప్రతీకగా అభివర్ణించారు, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్, ఆదివారం ఉదయగిరి సీతారాంపురం లో జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉదయగిరిలోని చిన్న మసీదుకు మరియు సీతారాంపురంలోని మసీదుకు విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఉపవవాస దీక్ష విరమణలో పాల్గొన్నారు. అనంతరం మసీదు ఇమాము మరియు మౌజన్లకు , ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ముస్లిం మత గురువులు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి ఆశీర్వచనాలు అందచేశారు. ఇఫ్తార్ విందును ముస్లిం సోదరులకు వడ్డించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.