మనన్యూస్:సీతారాంపురం మండలం కేంద్రంలోని పట్టణానికి చెందిన కె నారాయణమ్మ అనారోగ్యంతో బాధపడుతూ తమ ఇబ్బందులను ఆదివారం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి వైద్యం చేయించుకోవాలని తెలియజేశారు. గత మూడు సంవత్సరాలుగా ఎంతోమంది అభాగ్యులను శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే ఆదుకున్నారని స్థానిక నాయకులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.