మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో… గ్రామదేవత
శ్రీ వేగులమ్మ అమ్మవారి..నవమ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు మరియు స్మార్త విద్యార్థుల పండిత బృందంతో..
మహాగణపతి పూజ, పుణ్యాహవాచన, అమ్మవారికి.. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనే, పంచదార, హరిద్ర కుంకుమ సుగంధ జలాలుతో విశేషముగా అభిషేకం… వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి లలిత సహస్రనామాలతో కుంకుమార్చన జరిపించారు… అనంతరం నీరాజన, మంత్రపుష్పాలు.. ప్రసాద వితరణ చేశారు.. ఆలయ సేవా సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి 9 వ పుట్టినరోజు సందర్భంగా ఈ పూజా కార్యక్రమాలు జరిపించినట్లు తెలియజేశారు..