స్వయంభూ గణపతి పీఠంలో 79వ జపయజ్ఞ పారాయజ్ఞా
మనన్యూస్,కాకినాడ:తండ్రిమాట
తల్లిమాటపాటించిన శ్రీరాముడు గరుత్మంతుడు ఆంజనేయుడు లోకఆరాధ్యుల య్యారని ధర్మాన్ని ఆచరిస్తేనే శ్రీవారి అనుగ్రహం కలుగుతుందని భోగిగణపతిపీఠంపేర్కొంది. శ్రీవారి 79వ జపయజ్ఞపారాయణ సందర్భంగా సూర్యారావు పేట దూసర్లపూడి వారి వీధిలో వేంచేసియున్న స్వయంభూ భోగి గణపతి పీఠంలో తోమాల సేవ నిర్వహించారు. కలియుగంలో అవతరించిన వేంకటేశ్వరస్వామికి రుద్రాంశ సంభూతులైన గరుత్మంతుడు హనుమంతుడు క్షేత్ర పాలకులుగా వుంటారని వారి ఆరాధనతో శ్రీవారిశ్రీకర శుభాలు కలుగుతాయ ని పీఠంఉపాసకులుదూసర్లపూడి రమణరాజు తెలిపారు.తిరుమల లోని అఖండహరినామసంకీర్తన మండపంలో ప్రపంచ వ్యాపిత ఆరాధకులు నిత్యభజనలు చేయడం వలన క్షేత్రపాలకులైన హనుమంతుడు గరుత్మంతుడు సదా తన్మయంతో ఆశీర్వదిస్తా రన్నారు. ఆనంద నిలయ వైభవాన్ని అఖండ సంకీర్తనలో తరించి పొందవచ్చన్నారు. అభిషేకించిన దానిమ్మ పండ్ల రసాన్ని తీర్ధంగా పంపిణీ చేశారు. పాల్గొన్నారు.