బంగారుపాళ్యం మార్చ్ 29 మన న్యూస్
తగ్గు వారి పల్లి పంచాయతీ లో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఎన్. పి. జయప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో టిడిపి జెండాను ఆవిష్కరించి, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రసంగిస్తూ. ఎన్టీఆర్ సామాన్య ప్రజలకు మంచి పాలన అందించేందుకు, రాజకీయం అంటే ప్రజాసేవ అనే మౌలిక సిద్దాంతాన్ని నెలకొల్పేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించారు" అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే పార్టీ కాదు, ఇది ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే పార్టీ, న్యాయం కోసం, అభివృద్ధి కోసం, సమగ్ర సంక్షేమం కోసం పని చేసే పార్టీ" అని మురళీమోహన్ వివరించారు. మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే శక్తి చంద్రబాబు కే ఉందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో , ఎన్. పి. జయప్రకాశ్ నాయుడు, ఎన్. పి. జయచంద్ర నాయుడు, ధరణి నాయుడు, తగ్గువారి పల్లి ఉపసర్పంచ్ లోకనాథ నాయుడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ హేమ చంద్ర నాయుడు, మైనార్టీ లీడర్ షబ్బీర్, యూత్ ప్రెసిడెంట్ మహేష్, సదకుప్ప హేమచంద్ర, యువ నాయకుడు సోము, ఉమాపతి, గోవిందు,అమరావతి, అంబికా, రామ్ శివన్న, రెడ్డప్ప, జాకీర్, సర్దార్, విజయ్, దీన, ఈశ్వర, భాస్కర్ గోవిందా చారి, అబ్దుల్లా, సాదిక్ చందు, శాంతి, రెడ్డప్ప, మురుగేష్, రసూల్, మహేంద్ర,మరియు స్ధానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గోన్నారు.