మన న్యూస్ శంఖవరం అపురూప్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఈ ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొత్త అమావాస్య వస్తోందంటే చాలు ఇక్కడి భక్తులకు ఎంతో ఆనందం. శంఖవరం లో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అమావాస్య ముందు రోజు (శుక్రవారం రాత్రి) ఇక్కడ భారీ ఎత్తున జాగరణ, 29వ తేదీ శనివారం తీర్థం ఘనంగా నిర్వహించారు. "పర్వత" కుటుంబీకులు నెలకొల్పిన ఈ ఆలయంలోని అమ్మవారు మహిమ గల తల్లిగా పూజలు అందుకుంటోంది. జాతర పురస్కరించుకొని పర్వత కుటుంబీకులు అమ్మవారి ఆలయాన్ని సుందరంగా అలంకరించి, విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. సుమారు 150 ఏళ్ల క్రితం నిర్మించిన అమ్మవారి ఆలయం శిథిలావస్థకు చేరింది. ఆలయానికి ఎదురుగా ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు కాలక్రమేణా ఎత్తు కావడంతో ఆలయ గర్భం భూమిలోకి కూరుకుపోయినట్లుగా తయారైంది. ఇప్పటికైనా నూకాంబిక అమ్మవారికి నూతన ఆలయ నిర్మాణ యోచన చేయాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు.అమ్మవారిని దర్శించుకున్న అధికారులు… శంఖవరం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ ఎస్ శర్మ, పంచాయితీ సెక్రెటరీ అప్పలరాజు, గ్రామంలో గల నాయకులు, పెద్దలు సచివాలయ సిబ్బంది తదితరులు స్థానిక నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ జాతర మహోత్సవానికి శంఖవరం గ్రామ పరిసర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జాతర మహోత్సవానికి అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరిబాబు నేతృత్వంలో ప్రత్యేక బందోబస్తు కల్పించారు