మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..
చైర్మన్ గా దొడ్ల కవిత ప్రభాకర్ రెడ్డి ని,వైస్ చైర్మన్ గా కొంగల శంకర్ గారితో పాటు 16 మంది సభ్యులతో నూతన పాలకమండలిని నియమించింది..
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు క్యాంపు కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ లకు నియామక పత్రాలు అందజేశారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన పాలకవర్గాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు..