మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు(దుర్గా శ్రీనివాస):
ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తి అక్షర సత్యం. నాయకుడు కంటే నడిపించే వాడే కాదు. ప్రజల కష్టాలను తెలుసుకున్న వాడే నిజమైన నాయకుడు. అటువంటి మంచి మనసున్న ప్రజలకు ప్రత్తిపాడు నియోజకవర్గ వైకాపా నేత, ఎం ఎం ఆర్ టెస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు. రాజకీయ నేతగా ట్రస్ట్ చైర్మన్ నియోజవర్గంలో ఉన్నటువంటి అన్ని మార్గాల నిరుపేద ప్రజలకు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు వేల కట్టలేనివి. పేద ప్రజానీకానికి ఆయన చేస్తున్న సేవ కార్యక్రమాలపై నేతల సైతం ఫిదా అవుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఒకవైపు నియోజవర్గ నేతగా కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటిస్తూనే మరోవైపు ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తూ మనసున్న మహారాజుగా, ప్రజా సేవకుడిగా ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తూ నియోజవర్గంలోని పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేదానికి ఆయన చేస్తున్న కృషి వెనకట్టలేనిది. పార్టీ కార్యకర్తలను పార్టీ కార్యక్రమంలో కలుపుకుంటూ వారితో కలిసి గ్రామలలో పర్యటిస్తూ నూతన ఓరావాడిని సృష్టిస్తున్నారు. ఎవరికైనా కష్టం ఉందని తెలిస్తే తన వంతు సాయం అందిస్తూ రాజకీయాల్లోకి అధికమైన సేవలు అందిస్తూ ముదునూరి తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు.