మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని అచ్చంపేట్ సొసైటీ చైర్మన్ కయ్యం నరసింహారెడ్డి అన్నారు.నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట రైతు వేదికలో మహా గర్జన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ సంగమేశ్వర్ గౌడ్ ఆదాయ వ్యవహారాల గురించి చదివి వినిపించారు. అనంతరం సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్,తదితరులు ఉన్నారు.