మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం(దుర్గా శ్రీనివాస):
ఏలేశ్వరంలో మండల యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు బిషప్ జోసెఫ్ ఆండ్రూస్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి పెద్ద వీధి సిఓఎం చర్చిలో గురువారం రాత్రి సంతాప సభ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశం లో జోసెఫ్ ఆండ్రూస్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని,ఈ మృతి పై ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ వేసి ప్రవీణ్ పగడాల మృతికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలి అన్నారు. అంతేకాకుండా క్రైస్తవులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వాటిని ప్రభుత్వం చొరవ తీసుకొని అరికట్టే చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. చిన్నప్పుడు మనం నేర్చుకున్న పాఠాలు అన్ని మతాలవారు సోదర భావంతో మెలగాలని అందరూ కలిసిమెలిసి ఉండాలని ప్రతిజ్ఞ చేసిన రోజులు మర్చిపోకూడదని ఆయన అన్నారు. ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవుల అందరి హృదయాలలో దిగ్బ్రాంతిని మిగిల్చిందనారు.ఈ సమావేశంలో స్థానిక సంఘ కాపరి సము చంద్, జిల్లా నాయకులు ఇమ్మానియేల్ రాజ్, మండల ప్రెసిడెంట్ ఎం సత్యానందం, కమిటీ సభ్యులు ఆమోస్, సువర్ణమ్మ,జై రాజు,ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.