మనన్యూస్,నెల్లూరు:నగరంలోని 52 వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ షైక్ మహబూబ్ భాషా ఆద్వర్యంలో శుక్రవారం చిరు వ్యాపారుల భరోసా కార్యక్రమం జరిగింది.శాసన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిలుపు మేరకు 52 వ డివిషన్ లోని రైల్వేవీధి లో నివసిస్తున్న షైక్ మముల అనే మహిళకు చిరు వ్యాపారుల భరోసా పేరుతో తోపుడు బండిని రంజాన్ కానుకగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా 52 వ డివిజన్ ఇంచార్జి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షన నిలిచే పార్టీ అని తెలిపారు.పార్టీ అధికారంలో లేకపోయినా పేదలకు అండదండగానిలుస్తుందనన్నారు.పేదలకు ఎలాంటి ఆపద వచ్చిన తమవంతు సహాయం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ కందుకూరు రమేష్ మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.