మనన్యూస్,వింజమూరు:తేది.29.03.2025, శనివారం నాడు ఉదయం మన తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామ / పంచాయతీ / మండల కేంద్రములలో కార్యకర్తలు నాయకులందరూ పాల్గొని జండా ఆవిష్కరణ కార్యక్రమాలను పండుగ వాతావరణములో ఘనంగా నిర్వహించవలెనని తెలియచేయడమైనది.అలానే
గ్రామ / పంచాయతీ / మండల పార్టీ నాయకత్వం ఒక రోజు మునుపు అనగా తేది.28.03.2025, శుక్రవారం నాడు వారి గ్రామ / పంచాయతీ / మండల కేంద్రములలో ఉన్న స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాలను మరియు జండా దిమ్మెలను శుభ్రపరచుకొని ఆవిర్భావ దినోత్సవ నాడు అనగా 29వ తేది కార్యక్రమానికి సిద్ధం చేసి తెలుగుదేశం పార్టీ ఆవిర్బవ దినోత్సవ కార్యక్రమంను గణముగా నిర్వహించా లని ఉదయగిరి మ్మెల్యే కాకర్ల సురేష్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన తెలియజేశారు.