మనన్యూస్:ఎమ్మెల్యేని ఆహ్వానించిన సమరసత ఫౌండేషన్ కలిగిరి మండల కన్వీనర్ కదిరి రంగారావు సురేఖ దంపతులు, మేకపాటి మాల్యాద్రి నాయుడు..!శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, అయోధ్య, భద్రాచలం మరియు ఒంటిమిట్ట, పుణ్యక్షేత్రాలలో జరుగు శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి తరంబ్రాలను అన్ని ప్రాంతాల నుండి పంపుతారు. అందులో భాగంగా తిరుమల తిరుపతి, మరియు సమరత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి గోటితో వలసిన కోటి తలంబ్రాలను కలిగిరి లో వేంచేసియున్న శ్రీ కలిగిరమ్మ దేవస్థానానికి చేరుస్తారు. అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి, వేద పండితుల ఆధ్వర్యంలో శిరస్సు మీద ఉంచుకొని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడనుండి రవాణా ద్వారా భద్రాచలం,మరియు ఒంటిమిట్ట ,అయోధ్య, కు తరలిస్తారు. శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం ఆ తలంబ్రాలను, ముత్యాల తలంబ్రాలుగా తిరిగి పంపుతారు. ముత్యాల తలంబ్రాలను అన్ని గ్రామాల రామాలయాలకు పంపి గ్రామంలోని వారికి పంపిణీ చేస్తారు. అక్షంతల రూపంలో ఆశీర్వాదాలు అనుకున్న వారికి సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు, కలుగుతాయని నమ్మకం. ఇంతటి గొప్ప కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ని సతీసమేతంగా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సమరసత ఫౌండేషన్ కలిగిరి మండల కన్వీనర్ కదిరి రంగారావు సురేఖ దంపతులు మరియు మేకపాటి మాల్యాద్రి నాయుడు ఎమ్మెల్యేకి ఆహ్వానం పలికారు. గత రెండు సంవత్సరాలుగా శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులకు అన్నదానం నిర్వహించారు.