మనన్యూస్,నెల్లూరు:రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కోవూరు నియోజకవర్గ వైసిపి నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి గా నియమితులు అయిన బట్టేపాటి నరేంద్ర రెడ్డి కలిశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సూచనల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి గా బట్టేపాటి నరేంద్ర రెడ్డిని నియమించిన సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపి భవిష్యత్ లో మరింత ఉన్నత శిఖరాలను అదిష్టించాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో జొన్నవాడ దేవస్థానం చైర్మన్ మవులూరు శ్రీనివాసులురెడ్డి కోవూరు నియోజకవర్గ వైసీపీ ఇంటలెక్చువల్స్ ఫోర్ విభాగ అధ్యక్షులు కొండ్లపూడి శ్రీనివాసులురెడ్డి, కోవూరు నియోజకవర్గ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు బిడదవోలు రూప్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు షేక్ షబ్బీర్ గారు, దిలీప్, సుమంత్, కిషోర్,విష్ణు పాల్గొన్నారు.