మనన్యూస్,నెల్లూరు:సంతపేట 49 వ డివిజన్ ఈద్గామిట్ట ప్రాంతంలో మజ్జిగ జయకృష్ణా రెడ్డి మరియు ఖాదర్ బాషా ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆ ప్రాంత వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి 500 మంది ముస్లిం మహిళలకు చీరలు నిత్యవసరవస్తువులు అందజేశారు.ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…….రంజాన్ మాసంలో మైనార్టీ సోదర, సోదరీ మణులు.. ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని..సమాజ శ్రేయస్సును ఆకాంక్షించి.. ఉపవాస దీక్షలను ఆచరించడం సంతోషకరమన్నారు.ఈ దీక్షల వలన ముస్లింలు ప్రతి ఒక్కరిలో సేవాగుణం, క్షమాగుణం అలవరుతాయన్నారు.ముస్లిం సోదరులు చేపట్టే ఉపవాస దీక్షలు.. యావత్ సమాజానికి మొత్తం స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.రంజాన్ సందర్భంగా.. ముస్లింలు ప్రతి ఒక్కరికి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడ్పాటును అందిస్తుందని తెలిపారు.అందులో భాగంగా 49 వ డివిజన్ లో మజ్జిగ జయ కృష్ణారెడ్డి, ఖాదర్ ఆధ్వర్యంలో 500 మంది ముస్లిం మహిళలకు.. రంజాన్ తోఫా అందజేయడం సంతోషకరమన్నారు.ఇలా నగర నియోజకవర్గంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ.. ముస్లిం సోదరులకు అండగా నిలిచి.. రంజాన్ మాసంలో వారికి సహాయ, సహకారాలు అందిస్తూ వస్తున్నారని తెలిపారు.రాబోయే రోజుల్లో.. ప్రతి ఒక్కరు .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా.. పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు.