మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీగా నియమితులైన పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య ఘనంగా సన్మానించారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరులోని ఆదాల కార్యాలయంలో ఆయన మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి కి శాలువాకప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా నెల్లూరు విజయ డెయిరి చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి కి స్వర్ణ వెంకయ్య శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయి పదవి పొందిన సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాశం శ్రీనివాస్, యేసునాయుడు, సిహెచ్ హరిబాబు యాదవ్, వై వి రెడ్డి, స్వర్ణ జీవన్ ప్రసాద్, కొండేటి నరసింహారావు, షేక్ అల్లాబక్షు, చెరుకూరు మధు, బెల్లంకొండ వెంకయ్య తదితరులు ఉన్నారు.