మనన్యూస్,నెల్లూరు:పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకలు ఆదాల ప్రభాకర్ రెడ్డిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధికార ప్రతినిధిగా నియమితులైన సీనియర్ నాయకులు బట్టేపాటి నరేందర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. శుక్రవారం నెల్లూరులోని ఆదాల కార్యాలయంలో మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డికి సాయిబాబా ప్రతిమను అందజేసి, పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి కోవూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా కందుకూరు మాజీ శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డికి సాయిబాబా ప్రతిమను అందజేసి ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నెల్లూరు విజయ డెయిరి చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డికి సాయిబాబా ప్రతిమను అందజేసి సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మావులూరు శ్రీనివాసులురెడ్డి, కొల్లపూడి శ్రీనివాసులురెడ్డి, పీ. దిలీప్ రెడ్డి, షేక్ షబ్బీర్, తాటి వెంకటరమణరెడ్డి, షేక్ అల్లా బక్షు తదితరులు ఉన్నారు.