మనన్యూస్,తిరుపతి:మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలను విస్తృతం చేయాలని ఆ సంస్థ సెంట్రల్ కమిటీ డైరెక్టర్ ఎన్ వి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన నెలవారి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవీయ విలువలతో కూడిన స్వచ్ఛంద సేవలను క్షేత్రస్థాయిలో చేరేలా చూడాలన్నారు. బాడీ ఫ్రీజర్ లను తీసుకెళ్లేందుకు అనువుగా వాహనాన్ని సిద్ధం చేయాలి అన్నారు. శాంతిరథం సేవలను బాగా పెంచాలన్నారు. కమిటీ సభ్యులందరూ చర్చించుకుని కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మానవతా సభ్యులు పద్మనాభం,ఎంవి రమణ, భార్గవ,సుకుమార్ రాజు, వేణుగోపాల్, సుధాకర్ బాబు,రామస్వామి, భాస్కర్ రెడ్డి, కోల ముని రామయ్య, రమణయ్య,భాగ్యమ్మ, భాస్కర్, నరసింహులు, మాధవ రాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.